బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపించింది. భారీ వర్షాలకు తోడు బలమైన ఈదురుగాలులు వీయడంతో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఇళ్ల రేకులు ఎగిరిపడ్డాయి. మరికొన్ని ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఏపీలో మొదలైన ఈ ప్రభావం తెలంగాణలోని కొన్ని జిల్లాలపైనా కనిపించింది. మరి రెండు రాష్ట్రాల్లో...
FlashNews:
Hormuz Tanker Attack: హర్మూజ్‌లో ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..
Gold, LPG, Rupee Explained: యుద్ధం ఎఫెక్ట్..మార్కెట్లలో ప్రకంపనలు! Gold నుంచి LPG వరకు.. అసలేం జరుగుతోంది?
Digital Arrest: పోలీసులమంటూ.. రూ.10 కోట్లు కొట్టేశారు! విజయవాడలో డిజిటల్ అరెస్ట్
Flydubai Flight Shocker: విమానాన్ని కూల్చే యత్నం.. !బయటకొచ్చిన వీడియో.. కో-పైలట్ ఉగ్ర కుట్ర?
Indian Pilot Saves 174 Lives: దుబాయ్ ఫ్లైట్ లో కత్తిపోట్లు.. విమానంలో అసలేం జరిగింది? ప్రాణాలకు తెగించి పోరాడిన కెప్టెన్
AP Govt Onion Subsidy:సర్కారు వారి పాట.. కిలో ఉల్లి రూ.35.. ఆధార్ ఉంటే చాలు!
Asifabad Collectorate Incident: ఆస్తులు రాసిచ్చాం..! పిల్లలు పట్టించుకోవడం లేదు కలెక్టరేట్లో తల్లిదండ్రుల కన్నీటి గాథ
Telangana ULC Lands: కాలనీల క్రమబద్దీకరణకుసర్కార్ గ్రీన్ సిగ్నల్! వేల కుటుంబాలకు భారీ ఊరట
FSSAI New Rules: స్కూళ్ల చుట్టూ జంక్ ఫుడ్ బ్యాన్? 50 మీటర్ల పరిధిలో అమ్మకాలపై ఆంక్షలు!
Prakasam Barrage Flood Inflows Rise: ఏపీలో భారీ వర్షాలు.. ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద
World’s Top 10 Best Free AI Tools: మీ రోజువారీ పనులను ఈజీగా చేసుకోవడానికి ఉపయోగపడే Top 10 Free AI Tools ఇవే!
Balapur Laddu History: ఏకంగా రూ.39 లక్షలు..! బాలాపూర్ లడ్డూ సరికొత్త రికార్డ్.. మూడు దశాబ్దాల అద్భుత చరిత్ర
Cyclone Fury in Telugu States: తీరం దాటిన తుఫాన్! తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం.. 3 రోజులు భారీ వర్షాలు!
Nani The Paradise: హీరో నాని రిక్వెస్ట్.. సీఎం రేవంత్ రిప్లై! థియేటర్ విజిట్ రద్దు చేసుకున్న నాని!
Kuppam Gets 2 New Express Train Stops: ‘కుప్పం’ కథ మారింది! 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కొత్తగా స్టాప్.. ఈ ఒక్క స్టేషన్లో మాత్రమే!
Sonu Sood’s Epic Reply to iPhone 18 Pro Fans: “కొత్త ఫోన్.. కొత్త EMI.. పాత బిల్లులే!” ఐఫోన్ లవర్స్‌కు సోనూ సూద్ కౌంటర్
AP Farmer Brain Dead, Saves 5 Lives Through Organ Donation: ఏపీ రైతు బ్రెయిన్ డెడ్..ఐదుగురికి ప్రాణదానం
YouTuber Vaishnavi’s Husband Murdered: యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య.. చెల్లెలి సమాధి సాక్షిగా..!
AP Residence Certificate New Rules: ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక.. రెసిడెన్స్ సర్టిఫికెట్‌పై కొత్త రూల్.. 581 జీవో రద్దు !
Category: National
India Faces 100% US Tariff Threat: భారత్‌కు ట్రంప్ షాక్..ఏకంగా 100 శాతం సుంకాలు! కీలక బిల్లుకు సభ ఆమోదం?
భారత్‌పై మరోసారి భారీగా సుంకాలు విధించే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలను టార్గెట్‌గా చేసుకున్న ట్రంప్ సర్కార్.. ఏకంగా 100 శాతం సుంకాలు విధించేందుకు సిద్ధం చేసిన ఓ బిల్లు.. హౌస్‌లో కీలక దశకు చేరుకుంది. ఫైనల్ ఓటింగ్ అనంతరం ఈ టారిఫ్ అమలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది జనవరిలో రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. వాణిజ్య సుంకాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ...
Railway Network Gets Massive Boost: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 4 లైన్ల రైల్వే నెట్‌వర్క్‌కు గ్రీన్ సిగ్నల్
రైల్వే రంగంలో కేంద్రం కీలక నిర్ణయం!ఏపీ రైల్వేకు బిగ్ బూస్ట్..!విజయవాడ, విశాఖపట్నం స్టేషన్లకు మహర్దశ!నాలుగు లైన్ల రైల్వే నెట్‌వర్క్‌కు గ్రీన్‌సిగ్నల్!దక్షిణాదిలో 5 భారీ మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులు!17 జిల్లాలు.. 2,121 గ్రామాలకు కొత్త కనెక్టివిటీ!తిరుమల టు యాదాద్రి.. కనెక్టివిటీ ఎలా మారనుంది?కొత్త రైల్వే లైన్ల రూట్ మ్యాప్ ఏంటి? రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారత రైల్వే నెట్‌వర్క్‌కు కేంద్రం భారీ బూస్ట్ ఇచ్చింది. రూ.20,804 కోట్లతో దేశవ్యాప్తంగా 8 భారీ రైల్వే ప్రాజెక్టులకు...
Vande Bharat: తిరుపతికి హైస్పీడ్ రైలు.. కొత్త వందే భారత్ వస్తోంది!.. రూట్ ఇదే!
తిరుమల శ్రీవారి భక్తులకు ఇక ప్రయాణం మరింత స్పీడ్ కానుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. ముఖ్యంగా కర్ణాటక నుంచి తిరుమల వచ్చే భక్తుల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. అయితే.. దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు రైలు ప్రయాణం గంటల తరబడి సాగడం, కొన్ని సందర్భాల్లో రిజర్వేషన్ దొరకకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ...
Impact on India’s Monsoon: ఎల్ నినో బలపడుతోంది! ఇస్రో ఉపగ్రహం కీలక సంకేతాలు.. భారత్‌లో వర్షాలపై తీవ్ర ప్రభావం?
భారతదేశంలో వర్షాలు ఎలా ఉండబోతున్నాయో.. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో జరుగుతున్న ఓ మార్పు నిర్ణయించగలదు. అదే ఎల్ నినో. ఇప్పుడు ఈ ఎల్ నినో బలపడుతోందనే కీలక సంకేతాలను ఇస్రోకు చెందిన EOS-06.. అంటే Oceansat-3 ఉపగ్రహం గుర్తించింది. సముద్రంలో ఉండే అతి చిన్న జీవులు ఫైటోప్లాంక్టన్. ఇవే సముద్ర ఆహార గొలుసుకు పునాది. వీటిలో ఉండే క్లోరోఫిల్-ఏ పరిమాణం తగ్గిపోతున్నట్లు Oceansat-3 గుర్తించింది. సాధారణ పరిస్థితులతో పోలిస్తే పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని...
Trump’s Big Shock to Indians in America: భారతీయులకు ట్రంప్ మరో షాక్..జీవిత భాగస్వాముల వర్క్ పర్మిట్ రద్దు! మహిళా ఉద్యోగులపై ప్రభావం
అమెరికాలో హెచ్-1బీ వీసాపై ఉద్యోగం చేస్తున్న భారతీయులకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. వీసా రూల్స్‌ను కఠినతరం చేస్తున్న ట్రంప్ సర్కారు.. ఇప్పుడు వారి జీవిత భాగస్వాముల ఉద్యోగాలపైనా కన్నేసింది. హెచ్-1బీ వీసాదారుల భార్య లేదా భర్తకు అమెరికాలో ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించే హెచ్-4 ఈ-ఏ-డీ వర్క్ పర్మిట్ విధానాన్ని రద్దు చేసే దిశగా కీలక ప్రతిపాదన చేసింది. ఇది అమల్లోకి వస్తే.. ముఖ్యంగా భారతీయ మహిళా ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.అసలు హెచ్-4...
Nepal Flash Floods Update: నేపాల్‌లో ఫ్లాష్ ఫ్లడ్ విధ్వంసం!.. పొంచి ఉన్న మరో విపత్తు!
సరిహద్దు.. మొన్నటివరకూ ప్రకృతి అందాలకు, ఆధ్యాత్మిక యాత్రలకు పేరు పొందిన ప్రాంతం. కానీ ఇప్పుడు అదే ప్రాంతం ఊహించని విపత్తుతో చిగురుటాకులా వణికిపోతోంది. ఒక్కసారిగా విరుచుకుపడిన ఫ్లాష్ ఫ్లడ్ కారణంగా, కొండ చరియలు విరిగిపడి.. భారీగా మట్టి, రాళ్లు, నీరు దిగువకు దూసుకురావడంతో గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోయాయి. రహదారులు తెగిపోయాయి.. వంతెనలు కూలిపోయాయి.. భవనాలు శిథిలాలుగా మారిపోయాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఆచూకీ లేకుండా పోయారు. వీరిలో ఈశా ఫౌండేషన్‌కు చెందిన 80...
150 Pakistani Brides Arrive in India: ఎట్టకేలకు శుభం కార్డు పడింది! భారత్‌కు 150 మంది పాకిస్థానీ వధువులు
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఓ ఆసక్తికరమైన పరిణామం తెరపైకి వచ్చింది. వాఘా-అట్టారి సరిహద్దు మూసుకుపోయినా.. 150 మంది పాకిస్థానీ వధువులు భారత్‌కు చేరుకున్నారు. వీళ్లంతా భారత్‌లోని యువకులతో నిశ్చితార్థం చేసుకున్నవారే. సరిహద్దు మూసివేయడంతో వీసాలు రాక.. వీరి పెళ్లిళ్లు నెలల తరబడి వాయిదా పడ్డాయి. మరి సరిహద్దు మూసి ఉంటే ఈ వధువులు భారత్‌కు ఎలా వచ్చారు? ఎవరి ప్రయత్నంతో వీరికి వీసాలు లభించాయి? ఇంకా పాకిస్థాన్‌లో ఎంతమంది వధువులు భారత్‌కు వచ్చేందుకు ఎదురుచూస్తున్నారు?...
Trump’s H-1B Visa Shock: భారతీయులకు ట్రంప్ షాక్.. $1 లక్ష దాటిన H-1B ఫీజు!
అమెరికాలో చదువుకోవాలన్నా.. ఉద్యోగం చేయాలన్నా.. ఇకపై భారతీయులకు మరింత కఠిన పరీక్ష ఎదురుకానుంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త వీసా నిబంధనలు.. ముఖ్యంగా H-1B వీసాపై భారీ ఫీజు పెంపు.. అమెరికాలో స్థిరపడాలని కలలు కనే వేలాది మంది భారతీయ నిపుణులు, విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏకంగా లక్ష డాలర్లకు పైగా ఉండే ఈ ఫీజును శాశ్వతం చేసే దిశగా అమెరికా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అసలు ఈ కొత్త నిబంధనలు ఏంటి?...
US Green Card New Rules: గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులపై మరో గుదిబండ!
అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న వారికి ఇది చాలా కీలకమైన వార్త. ఇప్పటివరకు పరిమితంగా పరిశీలించిన కొన్ని అంశాలను.. ఇకపై అమెరికా అధికారులు మరింత లోతుగా పరిశీలించనున్నారు. మీరు ప్రభుత్వ సాయం తీసుకుంటున్నారా? మీ ఆదాయం ఎంత? మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? మీ కుటుంబంపై ఎంతమంది ఆధారపడి ఉన్నారు? మీకు ఉన్న ఆస్తులు ఎంత? భవిష్యత్తులో మీరు సొంతంగా జీవించగలరా? ఇలాంటి అంశాలు కూడా మీ గ్రీన్‌కార్డు దరఖాస్తులో కీలకంగా మారబోతున్నాయి. అమెరికా...








