ఒక్కోసారి జీవితంలో కొన్ని నిమిషాలే మన ప్రాణాలను కాపాడతాయి.. కొన్ని క్షణాల ఆలస్యం ప్రాణాలనే బలిగొంటుంది. కానీ.. కాలం కలిసొస్తే.. అదే ఆలస్యం ప్రాణాలను నిలబెడుతుంది..! నేపాల్‌లో సంభవించిన ఈ భయానక వరదల్లో 26 మంది ఆంధ్రా యాత్రికుల విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. కేవలం 100 మీటర్ల దూరంలో జల ప్రళయం.. ముందున్న బ్రిడ్జి క్షణాల్లోనే కొట్టుకుపోయింది. కానీ.. అదే సమయంలో వాళ్లు అక్కడ లేకపోవడానికి కారణం ఓ చిన్న టీ బ్రేక్.. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ భూమ్మీద నూకలుంటే.. ఎంతటి మృత్యువు ఎదురొచ్చినా ప్రాణాలు దక్కుతాయంటారు కదా.. అచ్చు అలాగే జరిగింది ఈ 26 మంది విషయంలోనూ! అసలు ఆంధ్రా యాత్రికులు ఎలా తప్పించుకున్నారు?తిరుపతి నుంచి మొత్తం 26 మంది యాత్రికులు కైలాస్ మానస సరోవర్ యాత్ర కోసం నేపాల్ వెళ్లారు. వీసా క్లియరెన్స్‌లో ఆలస్యం కావడంతో కాఠ్మాండులో రెండు రోజుల పాటు హోటల్‌లోనే ఉన్నారు. ఆ...
News & Trending
Godavari Pushkaralu 2027: గోదావరికి పుష్కర వైభవం.. ముస్తాబవుతున్న నదీ తీరం.. అదిరిపోయే రేంజ్‌లో ఏర్పాట్లు
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ పావన గోదావరి తీరం పుష్కర శోభతో వెలిగిపోనుంది. బృహస్పతి సింహరాశిలోకి అడుగుపెట్టే ఈ పవిత్ర ముహూర్తాన సకల దేవతలు మరోమారు గోదావరీ జలాల్లో కొలువుదీరనున్నారు. సకల పాపాలను ప్రక్షాళన చేసే ఈ పుష్కర ఘడియల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. ఈ దివ్యమైన ఘడియల్లో స్నానమాచరించేందుకు తరలి వచ్చే కోట్లాది భక్తజనం కోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కనీవినీ ఎరగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నాయి. అటు సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే, అత్యాధునిక సాంకేతికతల సాయంతో భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూసేందుకు అధికారులు వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 300 రోజుల్లో వేద మంత్రాల ఉచ్ఛారణలు, తెలుగు వైభవాన్ని చాటే సాంస్కృతిక ప్రదర్శనలు, తల్లి గోదావరికి ఇచ్చే నిత్య హారతులతో తెలుగు రాష్ట్రాల్లోని వేలాది కిలోమీటర్ల తీర ప్రాంతమంతా భక్తి పారవశ్యంలో మునిగితేలబోతోంది. 12 సంవత్సరాలకు ఓసారి బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు...
Godavari Pushkaralu 2027: గోదావరికి పుష్కర వైభవం.. ముస్తాబవుతున్న నదీ తీరం.. అదిరిపోయే రేంజ్‌లో ఏర్పాట్లు
From ₹88 to ₹1.5 Lakh: బంగారం చరిత్ర! 80 ఏళ్లలో 1,711 రెట్లు పెరిగిన బంగారం! ₹88 → ₹1.5 లక్షలు
Dreams About Death: కలలో ఇవి కనిపిస్తే.. మరణానికి సంకేతమా? స్వప్నశాస్త్రం ఏం చెబుతోంది?
Week Popular & Top Categories
Ashtadasha 18 Shakti Peethas: సతీదేవి శరీర భాగాలు పడిన 18 ప్రదేశాలివే !
శివుని అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడి ఏర్పడిన పవిత్ర స్థలాలను శక్తి పీఠాలు అంటారు. వీటిలో 18 శక్తిపీఠాలు అష్టాదశ శక్తిపీఠాలుగా అందరికీ సుపరిచితమే. అయితే...
Ayyappa devotees : అయ్యప్ప దీక్షలో నల్లని దుస్తులే ఎందుకు ధరించాలి?
2. ‘స్వామి’ అని ఎందుకు పిలుస్తారు?
Dreams about death | కలలో ఇవి కనిపిస్తే మరణానికి సంకేతమా? స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది?
నిద్రలో కలలు కనడం అనేది అందరి జీవితంలోనూ జరిగే సాధారణ విషయమే. కొన్ని కలలు మనకు చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తే, మరికొన్ని లేనిపోని టెన్షన్లను కలిగిస్తాయి. భవిష్యత్తులో...
Dreams About Death: కలలో ఇవి కనిపిస్తే.. మరణానికి సంకేతమా? స్వప్నశాస్త్రం ఏం చెబుతోంది?
కలలు.. మన జీవితంలో చాలా సహజమైన అనుభవం. నిద్రలో వచ్చే కొన్ని కలలు మనకు ఆనందాన్ని కలిగిస్తే.. మరికొన్ని భయాందోళనకు గురిచేస్తాయి. కొన్ని కలలు మనం రోజువారీ...
Gandhari Vaana : ఎమోషనల్ మైథాలజీ స్టోరీ.. గాంధారి వాన అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది? ఆసక్తికరమైన విశేషాలు!
మన తెలుగు వాడుక భాషలో ఎన్నో జాతీయాలు, సామెతలు ఉంటాయి. అందులో ఒకటి ‘గాంధారి వాన’. అసలు వానకు గాంధారి పేరు ఎందుకు వచ్చింది? నిరుపయోగమైన వర్షానికి,...
Hindu death rituals | మరణించిన వారికి ఏ వేలితో బొట్టు పెట్టాలి? ఆచారాల వెనుక ఉన్న రహస్యం!
మన సంప్రదాయంలో జీవించి ఉన్నవారికి, మరణించిన పూర్వీకులకు బొట్టు పెట్టే విషయంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి. సాధారణంగా మనం చనిపోయిన వారి చిత్రపటాలకు దండ వేసి...
Arts & Culture
Real Paneer vs Analogue Paneer : అసలు పనీర్ vs అనలాగ్ పనీర్.. తేడా ఏంటి? ఎలా గుర్తించాలి?
మహారాష్ట్రలో నాన్-డెయిరీ లేదా అనలాగ్ పనీర్ తయారీ, విక్రయాలపై నిషేధం విధించడంతో దేశవ్యాప్తంగా దీనిపై చర్చ మొదలైంది. అసలు పనీర్‌కు, అనలాగ్ పనీర్‌కు మధ్య తేడా ఏంటి? ఇది ఎలా తయారవుతుంది? కల్తీ పనీర్‌ను ఎలా గుర్తించాలి? వినియోగదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పనీర్.. భారతీయ వంటకాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన పాల ఉత్పత్తి. అయితే మార్కెట్‌లో తక్కువ ధరకు లభించే కొన్ని పనీర్ ఉత్పత్తుల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సంప్రదాయ పాలతో తయారయ్యే పనీర్‌కు ప్రత్యామ్నాయంగా నాన్-డెయిరీ లేదా అనలాగ్ పనీర్ మార్కెట్‌లోకి వస్తోంది. మహారాష్ట్రలో అనలాగ్ పనీర్‌పై నిషేధం అనలాగ్ పనీర్ తయారీ, విక్రయం, నిల్వ, పంపిణీపై మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కల్తీ పాల ఉత్పత్తుల విక్రయాలను అరికట్టడంతో పాటు.. వినియోగదారులను తప్పుదోవ పట్టించే విధానాలకు చెక్ పెట్టడమే ఈ చర్యల ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు. అంతకుముందు ఛత్తీస్‌గఢ్ కూడా అనలాగ్ పనీర్‌పై...
Gold Loan: గోల్డ్ లోన్ కట్టకపోతే మీ బంగారం వెంటనే వేలం వేస్తారా? RBI రూల్స్ ఏం చెబుతున్నాయి?
Gold Loan Auction Rules: బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో గోల్డ్ లోన్లకు డిమాండ్ కూడా గణనీయంగా పెరిగింది. బంగారం విలువ అధికంగా ఉండటంతో గతంతో పోలిస్తే ఎక్కువ మొత్తంలో రుణం లభిస్తోంది. దీంతో అత్యవసర ఆర్థిక అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి గోల్డ్ లోన్ తీసుకుంటున్నారు. అయితే గోల్డ్ లోన్ తీసుకున్న తర్వాత రుణాన్ని సకాలంలో చెల్లించకపోతే ఏమవుతుంది? బ్యాంకులు వెంటనే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేస్తాయా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. కానీ RBI నిబంధనల ప్రకారం బ్యాంకులు వెంటనే ఆభరణాలను వేలం వేయలేవు. వెంటనే వేలం వేయరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం, రుణగ్రహీతకు ముందుగా బకాయిలు చెల్లించేందుకు తగిన అవకాశం ఇవ్వాలి. వడ్డీ లేదా ఈఎంఐలు చెల్లించాలని బ్యాంకులు పలుమార్లు ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, నోటీసుల ద్వారా గుర్తు చేస్తాయి. రుణాన్ని...
Nature
Nepal Flood Horror: ఎటు చూసినా కుళ్లిన శవాలు.. తమవారి కోసం జనం గాలింపు .. సామూహికంగా శవాల ఖననం.. శిథిలాల్లో సజీవంగా ఆరేళ్ల చిన్నారి
ఒక్కసారిగా ఉప్పొంగిన నదులు.. కళ్లెదుటే కొట్టుకుపోయిన వంతెనలు.. వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన ఇళ్లు, కార్లు.. ఎటుచూసినా శిథిలాలు, మృతదేహాలే కనిపిస్తున్నాయి. నేపాల్‌లో ప్రకృతి సృష్టించిన ఈ జల ప్రళయం ఇప్పటికే 900కు పైగా ప్రాణాలను బలిగొంది.. వేలాది మందిని గల్లంతు చేసింది. కానీ.. ఈ భయానక విధ్వంసం మధ్య కొన్ని ఘటనలు మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. శిథిలాల కింద మూడు రోజుల తర్వాత సజీవంగా బయటపడిన ఆరేళ్ల చిన్నారి.. ఒక కప్పు టీ కోసం పది నిమిషాలు ఆగడంతో ప్రాణాలతో బయటపడిన ఐదుగురు స్నేహితులు.. ఇక చుట్టూ ఉన్న ఇళ్లు కూలిపోయినా వరద ఉధృతిని తట్టుకుని నిలబడిన ఆ పచ్చని ఇల్లు..! అసలు వీళ్లంతా ఎలా ప్రాణాలతో బయటపడ్డారు? ఆ ఒక్క ఇల్లు అంతటి భారీ వరదను తట్టుకుని ఎలా నిలబడింది. ఈ విపత్తులో ఇంకా ఎంత మంది గల్లంతయ్యారు? రెస్క్యూ ఆపరేషన్ ఎక్కడి వరకు వచ్చింది? నేపాల్‌ను కుదిపేస్తున్న ఈ...
Trump’s Big Shock to Indians in America: భారతీయులకు ట్రంప్ మరో షాక్..జీవిత భాగస్వాముల వర్క్ పర్మిట్ రద్దు! మహిళా ఉద్యోగులపై ప్రభావం
అమెరికాలో హెచ్-1బీ వీసాపై ఉద్యోగం చేస్తున్న భారతీయులకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. వీసా రూల్స్‌ను కఠినతరం చేస్తున్న ట్రంప్ సర్కారు.. ఇప్పుడు వారి జీవిత భాగస్వాముల ఉద్యోగాలపైనా కన్నేసింది. హెచ్-1బీ వీసాదారుల భార్య లేదా భర్తకు అమెరికాలో ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించే హెచ్-4 ఈ-ఏ-డీ వర్క్ పర్మిట్ విధానాన్ని రద్దు చేసే దిశగా కీలక ప్రతిపాదన చేసింది. ఇది అమల్లోకి వస్తే.. ముఖ్యంగా భారతీయ మహిళా ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.అసలు హెచ్-4 వీసా అంటే ఏంటి? హెచ్-4 ఈ-ఏ-డీ ఎవరికి వస్తుంది? ఈ వర్క్ పర్మిట్ రద్దయితే ఎవరికి ఎక్కువ నష్టం? ఇప్పుడున్న ఉద్యోగాలు వెంటనే పోతాయా? ముందుగా హెచ్-4 వీసా అంటే ఏంటో చూద్దాం. అమెరికాలో హెచ్-1బీ వీసాపై ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తన భార్య లేదా భర్తను.. అలాగే అర్హత ఉన్న పిల్లలను హెచ్-4 వీసాపై అమెరికాకు తీసుకెళ్లవచ్చు. అంటే హెచ్-1బీ వీసాదారుడితో...



















