టీమిండియా మహిళల క్రికెట్లో కెప్టెన్సీ మార్పు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో.. స్మృతి మంధానకు కెప్టెన్సీ దక్కింది. అయితే.. కెప్టెన్సీ మార్పునకు ఈ ఇద్దరి మధ్య విభేదాలే కారణమా? అనే చర్చ మొదలైంది.
హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన కొంతకాలంగా ఒకరితో ఒకరు ఏకాభిప్రాయానికి రాలేదని, దాంతో డ్రెస్సింగ్ రూమ్‌లో కొంత అసౌకర్య వాతావరణం ఏర్పడిందని ఓ టీమ్ సోర్స్ పేర్కొన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. అయితే.. గతంలో వీరిద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నప్పటికీ.. కెప్టెన్సీ విషయంలో విభేదాలు పెరిగినట్లు సమాచారం.
ఇక హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీపై బీసీసీఐతో జరిగిన రివ్యూ మీటింగ్‌లో చర్చ జరిగిన తర్వాత.. కెప్టెన్సీ మార్పు అనివార్యమని ఆమెకు స్పష్టమైనట్లు తెలుస్తోంది. దీంతో ఆమె మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు.
మరోవైపు.. 2013లో అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చిన స్మృతి మంధాన.. ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో 10 వేలకుపైగా పరుగులు చేసిన స్టార్ బ్యాటర్‌గా ఎదిగారు. గత ఏడాది వన్డే వరల్డ్ కప్ విజయంతో పాటు ఆసియా గేమ్స్‌లో భారత్‌కు వరుసగా రెండో స్వర్ణం అందించిన హర్మన్‌ప్రీత్.. ఇక ప్లేయర్‌గా కొనసాగనున్నారు.
అయితే.. కెప్టెన్సీ మార్పు తర్వాత మంధాన, హర్మన్‌ప్రీత్ తమ గత విభేదాలను పక్కనపెట్టి జట్టు కోసం ఎలా కలిసి పనిచేస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Leave a Reply