Coffee and High Blood Pressure: Myth or Fact?

ఉదయం నిద్రలేచినప్పటి నుంచి సాయంత్రం స్నేహితులతో టైంపాస్‌ దాకా.. చాలా మందిలో కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయమే ఉత్సాహం రావడానికి, మూడీగా ఉంటే రిలాక్స్‌ కావడానికి కాఫీ తోడ్పడుతుంది కూడా. అయితే కాఫీ వల్ల శరీరంలో రక్తపోటు పెరుగుతుందని చాలా మందిలో నమ్మకం ఉంది. ఇది కొంత వరకు వాస్తవం కూడా. కాఫీలో ఉండే కెఫీన్ ఉత్తేజకర పదార్థం. ఇది మెదడు, నాడీ మండలాన్ని యాక్టివేట్‌ చేస్తుంది. ఒక కాఫీ తాగినప్పుడు దాని ప్రభావం 30 నిమిషాల నుండి 2 గంటల వరకు ఉంటుంది. కాఫీ రక్తపోటును పెంచినా అది తాత్కాలికమేనని నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటు ఉన్న వారు, లేనివారు అందరిలోనూ ఈ ప్రభావం ఉంటుంది. అయితే వ్యక్తులను బట్టి, వారు కెఫీన్‌ ను ఎంత వరకు తట్టుకోగలరు, దానికి ఎంత ప్రభావితం అవుతారన్న దాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. తరచూ కాఫీ లేదా కెఫీన్ ఉన్న డ్రింక్స్‌ తాగేవారితో పోలిస్తే… అప్పుడప్పుడు తక్కువగా తాగేవారిలో రక్తపోటు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.