ఏడుకొండలపై వెలసిన వెంకన్న కన్నులు ఎప్పుడూ మూసి ఉంటాయని ప్రతి ఒక్కరు వినే ఉంటారు. అసలు దీని వెనుకున్న ఆంతర్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుపతి దేవస్థానాన్ని కలియుగంలో వేంకటేశ్వరుని నివాసంగా పరిగణిస్తారు. శ్రీ హరి అవతారమైన వేంకటేశ్వరడి శక్తివంతమైన కళ్ళను మూసే ఉంచుతారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కళ్లలోకి భక్తులునేరుగా చూడలేరు. వెంకన్న కళ్ళు విశ్వశక్తికి మించినవని పండితులు చెబుతున్నారు. ధార్మిక గ్రంధాల ప్రకారం తిరుపతి బాలాజీ కళ్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, ఆయన కళ్లు చాలా తీక్షణంగా ఉంటాయని, నేరుగా చూడలేమని చెబుతున్నారు. ఈ కారణంగానే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్లను ఎప్పుడూ పచ్చ కర్పూరంతో మూసి ఉంచుతారట. కేవలం గురువారం మాత్రమే వేంకటేశ్వరుని నేత్రాలను భక్తులు చూడవచ్చని చెబుతారు. ఎందుకంటే ప్రతి గురువారం, వెంకటేశ్వర స్వామికి చందనంతో అభిషేకం చేసి, ఆపై ఆయన విగ్రహానికి చందనం పూస్తారు. ఆయన గుండెల పై చందనం పూత పూయడం వల్ల లక్ష్మీదేవి ప్రతిమ కనిపిస్తుంది.
Leave a Reply