Electricity Bill Too High: కరెంట్ బిల్లు ఎక్కువ వస్తోందా? ఈ నంబర్‌కు కాల్ చేస్తే చాలు!

ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్ వినియోగదారులకు UPPCL కీలక సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక కరెంట్ బిల్లు వివరాలు తెలుసుకోవడం, బిల్లు డౌన్‌లోడ్ చేసుకోవడం, తప్పుగా వచ్చిన బిల్లుపై ఫిర్యాదు చేయడం, మీటర్ రీడింగ్ పంపించడం వంటి పనులను ఇంటి నుంచే చేసుకోవచ్చు. ఇందుకోసం UPPCL WhatsApp Chatbot సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది.

మీ ప్రాంతానికి సంబంధించిన డిస్కమ్ WhatsApp నంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకుని.. WhatsAppలో Hi లేదా MENU అని మెసేజ్ పంపాలి. ఆ తర్వాత మీ 10 లేదా 12 అంకెల విద్యుత్ అకౌంట్ నంబర్‌ను నమోదు చేస్తే.. బిల్ చెక్, సెల్ఫ్ బిల్లింగ్, కంప్లైంట్ రిజిస్టర్, పేమెంట్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. మీకు అవసరమైన ఆప్షన్‌ను ఎంచుకుని అక్కడే సేవ పొందొచ్చు.

మధ్యాంచల్ డిస్కమ్ పరిధిలోని వినియోగదారులు 7669003409, పూర్వాంచల్ వినియోగదారులు 8010968292, పశ్చిమాంచల్ వినియోగదారులు 7859804803, దక్షిణాంచల్ వినియోగదారులు 8010957826 నంబర్లను ఉపయోగించవచ్చు. ఇక కాన్పూర్ సిటీ ప్రాంత వినియోగదారులు 8287835233 నంబర్‌కు WhatsAppలో మెసేజ్ చేయాలి.

అంటే.. బిల్లు కోసం, చిన్న చిన్న ఫిర్యాదుల కోసం ఇక విద్యుత్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. WhatsAppలోనే చాలా సేవలు పొందొచ్చు.

Leave a Reply

Your email address will not be published.