నేటి డిజిటల్ యుగంలో యూపీఐ (UPI) మన రోజువారీ ఆర్థిక లావాదేవీలలో అంతర్భాగమైపోయింది. చిన్న మొత్తాల నుంచి పెద్ద చెల్లింపుల వరకు క్షణాల్లో జరిగిపోతుండటంతో, యూపీఐ వాడకం విపరీతంగా పెరిగింది. అయితే, మనం బ్యాంక్ ఖాతా మారినప్పుడు లేదా పాత అకౌంట్‌ను మూసివేసినప్పుడు, ఒక ముఖ్యమైన విషయాన్ని తరచుగా విస్మరిస్తుంటాం. అదే.. మన యూపీఐ యాప్‌లో ఇంకా కొనసాగుతున్న పాత బ్యాంక్ ఖాతాల తొలగింపు.
ఎందుకు తొలగించాలి? చాలామంది యూపీఐ యాప్‌లలో ఒకే మొబైల్ నంబర్‌తో ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలను లింక్ చేస్తారు. అయితే, కొత్త ఖాతా యాడ్ చేసినంత మాత్రాన పాత ఖాతా ఆటోమేటిక్‌గా డిలీట్ అవ్వదు. అది అలాగే యాప్‌లో ఉండిపోతుంది. దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి:
- లావాదేవీల విఫలం: ఇక యాక్టివ్‌లో లేని పాత ఖాతానే డిఫాల్ట్‌గా ఉంటే, మీరు చేసే చెల్లింపులు విఫలమయ్యే అవకాశం ఉంది.
- రిఫండ్ సమస్యలు: ఆన్లైన్ షాపింగ్ లేదా ఇతర చెల్లింపుల రిఫండ్స్ పొరపాటున ఆ పాత అకౌంట్‌కు వెళ్తే, వాటిని తిరిగి పొందడం కష్టమవుతుంది.
- గందరగోళం: మల్టిపుల్ అకౌంట్స్ కనిపిస్తుండటంతో, ఏ ఖాతా నుంచి డబ్బు కట్ అవుతుందో తెలియక వినియోగదారులు కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలపై తక్కువ అవగాహన ఉన్నవారికి మరింత ఇబ్బందికరంగా మారుతుంది.
పాత ఖాతాను తొలగించడం ఎలా? ఈ సమస్యలను నివారించడానికి, మీరు ప్రస్తుతం వాడుకలో లేని బ్యాంక్ ఖాతాలను యూపీఐ యాప్ నుంచి తొలగించడం ఉత్తమం.
- మీ యూపీఐ యాప్‌లో ‘ప్రొఫైల్’ లేదా ‘బ్యాంక్ అకౌంట్స్’ సెక్షన్లోకి వెళ్లండి.
- అక్కడ లింక్ అయి ఉన్న ఖాతాల జాబితా కనిపిస్తుంది.
- మీరు తొలగించాలనుకుంటున్న ఖాతాను ఎంచుకుని ‘రిమూవ్’ (Remove) లేదా ‘అన్‌లింక్’ (Unlink) బటన్‌పై క్లిక్ చేయండి.
ముఖ్య గమనిక: ఏదైనా ఖాతాను తొలగించే ముందు, ఆ ఖాతాకు ఆటోపే (Auto-pay), ఈఎంఐ (EMI) లేదా ఏదైనా సబ్స్క్రిప్షన్లు లింక్ అయి ఉన్నాయేమో ఒకసారి సరిచూసుకోండి. అలాగే, భవిష్యత్తులో అవసరమైతే ఆ ఖాతాను మళ్లీ సులభంగా యాడ్ చేసుకోవచ్చు. క్రమపద్ధతిలో అనవసరమైన అకౌంట్లను తొలగించడం వల్ల మీ డిజిటల్ ఆర్థిక లావాదేవీలు సురక్షితంగా, సులభంగా ఉంటాయి

Leave a Reply