ప్రపంచంలోనే మొట్టమొదటి సాయిబాబా విగ్రహం ఇదే

సాయినాథుని దివ్య మందిరం మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసింది ఆంధ్రాలోనే అని మీకు తెలుసా..? ఓ సామాన్య సాయి భక్తుడి అద్భుత ఆలోచనే ఈ సాయిబాబా ఆలయం. ఇంతకీ ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆలయం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా ఈ ఆలయాన్ని నక్షత్ర ఆకారంలో నిర్మించారు. అలానే ప్రపంచంలోనే మొట్టమొదటి సాయిబాబా విగ్రహం ప్రతిష్టించింది కూడా ఇక్కడే. 2009 సంవత్సరంలో కర్నూలు జిల్లాను వరదలు ముంచేత్తిన నక్షత్రకారం నిర్మాణం చీమంతైనా చెక్కుచెదరలేదు.

ఆ మందిరంలో గోడలపైన సాయినాధుని దివ్య చరితం తెలిపే అద్భుతమైన శిలాకృతులు ఉన్నాయి. పవిత్ర తుంగతీరంలో వెలసి.. దక్షిణ షిరిడిగా పేరుగాంచిన సాయినాధుడి దివ్య సన్నిధి ఇది. శాంతి స్వరూపుడు సాయినాధుడి మరో రూపం గురుదత్త సన్నిధితో పాటు ఆలయం ఎదుటే సాయినాధుడి దివ్య పాదా రక్షలు ఏర్పాటు చేసారు.

ఈ సాయిబాబా దేవస్థానాన్ని 1949లో శంకుస్థాపన చేశారు. 1951లో ఈ గుడి నిర్మాణాన్ని పూర్తి అద్భుతమైన శిల్పకళతో ఎక్కడా లేని విధంగా మొట్ట మొదటి సారిగా సాయిబాబా విగ్రహ ప్రతిష్ట చేసి ఆలయాన్ని నక్షత్ర ఆకారంలో నిర్మించారు.

Leave a Reply

Your email address will not be published.