స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్‌లో కువైట్ జెండాతో ప్రయాణిస్తున్న ట్యాంకర్‌పై క్షిపణి దాడి కలకలం రేపింది. ఈ ఘటనలో ట్యాంకర్లో ఉన్న ఐదుగురు భారతీయులను ఒమన్ అధికారులు సురక్షితంగా రక్షించి.. ఒడ్డుకు తరలించారు.
హర్మూజ్ జలసంధిలో శనివారం ఉదయం.. కువైట్ జెండాతో ప్రయాణిస్తున్న MT కజిమా-3 అనే ట్యాంకర్‌పై క్షిపణి దాడి జరిగినట్లు సమాచారం. ఈ ట్యాంకర్ టోగోలోని లోమే పోర్ట్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
దాడి సమాచారం అందిన వెంటనే.. ఒమన్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ట్యాంకర్లో ఉన్న ఐదుగురు భారతీయులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో సహకరించిన ఒమన్ అధికారులకు ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. భారత పౌరులను రక్షించే చర్యలను ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకున్నామని ఎంబసీ వెల్లడించింది. అయితే ట్యాంకర్‌పైకి దూసుకొచ్చిన క్షిపణి ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
మరోవైపు.. హర్మూజ్ జలసంధి ప్రపంచంలోని కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటి కావడంతో.. ఇక్కడ నౌకల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని వాణిజ్య నౌకల్లో పనిచేస్తున్న భారతీయ నావికుల భద్రతపై భారత్ నిశితంగా పర్యవేక్షిస్తోంది.

Leave a Reply