Hindu death rituals | మరణించిన వారికి ఏ వేలితో బొట్టు పెట్టాలి? ఆచారాల వెనుక ఉన్న రహస్యం!

మన సంప్రదాయంలో జీవించి ఉన్నవారికి, మరణించిన పూర్వీకులకు బొట్టు పెట్టే విషయంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి. సాధారణంగా మనం చనిపోయిన వారి చిత్రపటాలకు దండ వేసి తిలకం దిద్దుతుంటాం. అయితే, మరణించిన వారికి బొట్టు పెట్టేటప్పుడు ఏ వేలును ఉపయోగించాలనే దానిపై కొన్ని నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి.

సాధారణంగా సజీవంగా ఉన్నవారి నుదుటిపై బొట్టు పెట్టేటప్పుడు పొరపాటున కూడా చూపుడు వేలును ఉపయోగించకూడదని పెద్దలు చెబుతుంటారు. కానీ, మరణించిన వ్యక్తికి లేదా వారి ఫోటోకు బొట్టు పెట్టే సమయంలో మాత్రం కచ్చితంగా చూపుడు వేలును మాత్రమే ఉపయోగించాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి.

దీనికి ప్రధాన కారణం.. చూపుడు వేలు మోక్ష మార్గంతో ముడిపడి ఉంటుందని ఆధ్యాత్మికంగా నమ్ముతారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారు సద్గతులు పొందాలని కోరుకుంటూ చూపుడు వేలితో బొట్టు పెడతారు. ఈ పద్ధతి ద్వారా వారి ఆత్మ సరైన మోక్ష మార్గంలో పయనించడానికి సహాయపడుతుందని పెద్దల విశ్వాసం. కాబట్టి ఏ సందర్భంలో ఏ వేలితో తిలకం దిద్దుతున్నామనేది చాలా ముఖ్యమైన విషయంగా పరిగణిస్తారు.

Leave a Reply

Your email address will not be published.