దేవాలయం అంటేనే పవిత్రమైన స్థలం.నిత్యం పూజలు, హోమాలు, యాగాలు జరుగుతూ.. అక్కడ పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఆలయాల సమీపంలో ఉన్నవారందరకీ మంచి జరగాలి కదా? మరి ఆలయాల చుట్టుపక్కల ఇళ్ళు ఉండకూడదని ఎందుకంటారు? దేవాలయాల నీడ పడితే మంచిది కాదని చెబుతారెందుకు? ఇందులో నిజమెంత? వాస్తు శాస్త్ర పండితులు ఏమంటున్నారు? వాస్తు శాస్త్రం ప్రకారం శివాలయాలకు ఇళ్లు వెనుకవైపు..శ్రీ మహావిష్ణువు ఆలయాలకు ముందువైపు ఇళ్లు ఉండొచ్చు అంటున్నారు వాస్తు నిపుణులు. అయితే శివాలయానికి దగ్గరలో ఉంటే శత్రు భయం, విష్ణు ఆలయానికి దగ్గరలో ఉంటే ఇంట్లో డబ్బు నిలవదంటారు. ఇక అమ్మవారి ఆలయానికి దగ్గర్లో ఉంటే ఆ శక్తి కారణంగా ఆ ఇంట్లోని వారు ఎవరూ వృద్ధి చెందరట. విఘ్నాలు తొలగించే వినాయకుని ఆలయం ఇంటికి ఉత్తరం, వాయువ్యం వైపు ఉంటే ఈ ఇంట్లో ఉండేవారికి ధన నష్టం, అవమానాలు ఎదురవుతాయంటున్నారు. మొత్తంమీద ఆలయం నీడ పడే ఇంట్లో సుఖసంతోషాలు, మనశ్సాంతి ఉండదంటారు వాస్తు నిపుణులు.అందుకే ఆలయానికి మరీ దగ్గరగా కాకుండా కనీసం 200 అడుగుల దూరంలో ఇల్లు ఉండేలా చూసుకుంటే మంచిదట. ఇంటికి, గుడికి ఉండే దూరాన్ని గర్భ గుడిలో మూల విరాట్టు విగ్రహం నుంచి పరిగణలోకి తీసుకోవాలంటున్నారు నిపుణులు.

Leave a Reply