పెన్ను అంటే కేవలం రాసే సాధనం మాత్రమే కాదు, అది ఎంతో మందికి ఒక తీపి జ్ఞాపకం, ఒక ఎమోషన్. సాధారణంగా మనం వాడే పెన్నుల కంటే భిన్నంగా, ప్రపంచంలోనే అత్యంత చిన్న పెన్ను కలిగి ఉన్న వ్యక్తిగా బిహార్‌లోని నలంద జిల్లాకు చెందిన డాక్టర్ జగదీప్ నారాయణ్ కుమార్ అరుదైన ఘనత సాధించారు.

జపాన్ వ్యక్తి రికార్డును అధిగమించిన జగదీప్ జూన్ 14న జైపూర్‌లోని సైన్స్ సెంటర్లో జరిగిన ఒక అంతర్జాతీయ కార్యక్రమంలో, 25 దేశాల ప్రతినిధుల సమక్షంలో జగదీప్ నారాయణ్ తన వద్ద ఉన్న అరుదైన పెన్నును ప్రదర్శించారు. కేవలం 3 అంగుళాల పొడవు కలిగిన ఈ పెన్ను, ప్రపంచంలోనే అత్యంత చిన్నదిగా గుర్తింపు పొంది, ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకుంది. అంతకుముందు 3.5 అంగుళాల పెన్నుతో ప్రపంచ రికార్డును కలిగి ఉన్న జపాన్ వ్యక్తి రికార్డును, జగదీప్ తాజాగా అధిగమించారు.
34 ఏళ్ల క్రితం కేవలం రూ. 20కే కొనుగోలు! ఈ ప్రత్యేకమైన ఇత్తడి పెన్ను గురించి జగదీప్ పంచుకుంటూ, “దీనిని నేను సుమారు 34 ఏళ్ల క్రితం కేవలం 20 రూపాయలకు కొనుగోలు చేశాను,” అని తెలిపారు. ఆయన వద్ద ఉన్న 550కి పైగా పెన్నుల సేకరణలో, కేవలం 3 రూపాయలకు కొన్న మరో చిన్న పెన్ను కూడా ఉంది. 1988 నుంచే పురాతన నాణేలు, పెన్నులను సేకరించే అలవాటు ఉన్న జగదీప్, తన అభిరుచికి దక్కిన ఈ అంతర్జాతీయ గుర్తింపు పట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.
వృత్తిరీత్యా న్యాయవాది, ప్రవృత్తితో రికార్డుల వేట వృత్తిరీత్యా టాక్స్ అడ్వకేట్‌గా, విద్యావేత్తగా బిహార్ షరీఫ్‌లో పాఠశాలను నిర్వహిస్తూ బిజీగా ఉన్నప్పటికీ, తన సేకరించే అలవాటును ఆయన వదులుకోలేదు. 2023లో అరుదైన నాణేలు, కరెన్సీ సేకరణకు గానూ ఇప్పటికే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన జగదీప్, 2026లో ఇప్పుడు ఈ పెన్నుతో రెండోసారి ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. తన కృషి, పట్టుదలతో నలంద జిల్లాకు, బిహార్ రాష్ట్రానికి జగదీప్ గర్వకారణంగా నిలిచారు.

Leave a Reply